రేపు యోగా కోర్సులకు కౌన్సెలింగ్
Published Sat, Aug 27 2016 8:32 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ ద్వారా యోగా పీజీ డిప్లమో కోర్సు చేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ కోర్సును అందిస్తున్నామని వర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. కౌన్సెలింగ్‌కి వచ్చే అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా అన్నిరకాల ధృవీకరణ పత్రాలను, ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకుని ఉదయం 10 గంటలకల్లా వర్సిటీకి చేరుకోవాలన్నారు.
Advertisement
Advertisement