ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్ తరపట్ల సత్యనారాయణ అందిస్తున్న సాహితీ సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జాబిలి మాసపత్రిక జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రదానం
డాక్టర్ తరపట్లకు జాతీయ సాహితీ పురస్కారం
Jan 16 2017 10:55 PM | Updated on Sep 5 2017 1:21 AM
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) :
ఆదికవి నన్నయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్ తరపట్ల సత్యనారాయణ అందిస్తున్న సాహితీ సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో జాబిలి మాసపత్రిక జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జాబిలి తృతీయ వార్షికోత్సవంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్, మాజీ ఉపకులపతి ఆచార్య కె.ఇనాక్, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ, జాబిలి వ్యవస్థాపకుడు జయచంద్ర చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ‘భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి, జానపద విజ్ఞాన పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తూ కళలను కాపాడండి, కళాకారులను బతికించండి’ అనే నినాదంతో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, శతకవి సమ్మేళనాలు, పరిశోధనా శిబిరాల నిర్వహణ, పుస్తక రచన డాక్టర్ సత్యనారాయణకు ఈ çపురస్కారాన్ని తెచ్చిపెట్టాయి. ఇలాంటి పురస్కారాలు కవి, రచయితలకు కర్తవ్యాన్ని గుర్తు చేయడంతోపాటు బాధ్యతను మరింతగా పెంచుతాయని డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. వీసీ ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్ ఆ చా ర్య ఎ.నరసింహారావు, పలువురు అధ్యాపకులు సత్యనారాయణభినందించారు.
Advertisement
Advertisement