రాజానగరం (తూర్పుగోదావరి) : బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోరుకొండ గ్రామంలో ప్రవహించే బురుద కాలువకు గండిపడింది. దీంతో గ్రామంలోని ఇళ్లు మునిగిపోయాయి. దీంతో దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.