యానంలో ‘జెట్టి’ హీరో సందడి | Jetty Movie Hero Maanyam Krishna Visits Yanam | Sakshi
Sakshi News home page

యానంలో ‘జెట్టి’ హీరో సందడి

Published Sun, Nov 13 2022 10:25 AM | Last Updated on Sun, Nov 13 2022 10:25 AM

Jetty Movie Hero Maanyam Krishna Visits Yanam - Sakshi

‘జెట్టి’సినిమా హీరో మాన్యం కృష్ణ యానంలో సందడి చేశాడు. ఈ శుక్రవారం ఉదయం ఆటకు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుతో ప్రేక్షకుల సమక్షంలో సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ.. ఇటువంటి కథ లు తెరమీద కు తీసుకురావడం చాలా కష్టం. ఈ ప్రయత్నం చేసిన టీమ్ ని అభినందిస్తున్నాను. ఈ కథ లో చూపిన సమస్యలు చాలా మందికి బాధ్యతలను గుర్తు చేస్తాయి. ఈ సినిమా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. 

హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ.. ‘జెట్టి సినిమా ని ఆదరిస్తున్న యానం ప్రాంత వాసులకు కృతజ్ఞతలు. తీర ప్రాంతాలలో జెట్టి సినిమా ఆదరణ పెరుగుతుంది. షోలు కూడా పెరుగుతుండటం చాలా ఆనందం గా ఉంది. మల్లాడి కృష్ణ రావు గారికి కృతజ్ఞతలు.మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతున్నందుకు ఆనందం గా ఉంది’అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement