68వ రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైన్యంలో అత్యున్నత సేవలందించే వారికి ఇచ్చే సేనా పతకాన్ని పొందిన యానాంకు చెందిన మేజర్ ఓలేటి వీరనరేష్‌ను మంగళవారం పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఘనంగా సత్కరించారు. అయన ఛాంబర్‌కు తండ్రి
సేనా పతకం గ్రహీత వీరనరేష్‌కు సత్కారం
Feb 1 2017 12:25 AM | Updated on Sep 5 2017 2:34 AM
యానాం :
68వ రిపబ్లిక్ డే వేడుకల్లో భారత సైన్యంలో అత్యున్నత సేవలందించే వారికి ఇచ్చే సేనా పతకాన్ని పొందిన యానాంకు చెందిన మేజర్ ఓలేటి వీరనరేష్‌ను మంగళవారం పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఘనంగా సత్కరించారు. అయన ఛాంబర్‌కు తండ్రి వీరరాఘవ శర్మతో కలిసి వీర నరేష్ మర్యాద పూర్వకంగా వచ్చారు. ఈ సందర్భంగా వీరనరేష్‌ను పరిపాలనాధికారి సాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
చదువు,ఆటపాటలతో పాటు దేశంకోసం కూడా ఆలోచించాలి : వీర న రేష్
విద్యార్ధులు చదువు,ఆటపాటలతో పాటు దేశం కోసం కూడా ఆలోచించాలని దేశానికి ఏదైనా చేయాలనే దృఢ సంకల్పాన్ని అలవర్చుకోవాలని సేనా పతకం అవార్డు గ్రహీత ఓలేటి వీరనరేష్ ఉద్బోధించారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆర్.ఎస్.ఎస్. ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన శాఖా కార్యక్రమంలో వీరనరేష్ మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ ఖండ కార్యవాహ ఎ¯ŒSపీవీ రామారావు, సంపర్క్ ప్రముఖ్ పంచాగం విశ్వనాధం, ముఖ్యశిక్షఖ్ కుడిపూడి సూర్యప్రకాశ్ ‡ పాల్గొన్నారు.
Advertisement
Advertisement