విశాఖపట్నం: పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది.
ఇదిలా ఉండగా, కాకినాడలో గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. యానాంలో వృద్ధ గౌతమి ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ రోడ్, చెర్రీరోడ్, బాలయోగికాలనీ, న్యూ రాజీవ్ కాలనీలు ముంపుకు గురయ్యాయి. యానాం ఎమ్మెల్యే కృష్ణారావు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు.
**
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం
Published Tue, Sep 9 2014 6:03 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement