దేశసేవ మా బిడ్డకు దేవుడిచ్చిన అదృష్టం
-
మా అబ్బాయిని చూసి గర్విస్తున్నాం
-
సేనా మెడల్ గ్రహీత వీరనరేష్ కన్నవారి ఆనందం
యానాం :
దేశం కోసం సేవ చేసే అదృష్టాన్ని దేవుడు కొందరికి మాత్రమే ఇస్తాడని యానాంకు చెందిన ఓలేటి లక్షీ్మవీరనరేష్ తల్లిదండ్రులు వీరరాఘవశర్మ, అన్నపూర్ణ పేర్కొన్నారు.సైనికాధికారి అయిన నరేష్ సెప్టెంబర్ 29న జరిగిన సర్జికల్ దాడుల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మేజర్స్‌కు ఇచ్చే సేనా మెడల్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో శర్మ, అన్నపూర్ణ శుక్రవారం గోపాల్‌నగర్‌లోని స్వగృహంలో ‘సాక్షి’తో మాట్లాడారు. నరేష్ చదువులో బాగా రాణించాడని, ఉద్యోగరీత్యా జంగారెడ్డిగూడెంలో ఉండటంతో నరేష్ ప్రాథమికవిద్య జంగారెడ్డిగూడెం, ఏలూరు,అమలాపురంలలో సాగిందని అన్నారు. ఆరునుంచి పదవతరగతివరకు యానాం నవోదయలో, అనంతరం విశాఖలోని కొమ్మాది నవోదయలో ఇంటర్మీడియట్ చదివాడని తెలిపారు. 2000లో యూపీఎస్సీకి ఎంపికై అనంతరం పూనె వద్దనున్న కడగోశలలో నేషనల్ డిఫె¯Œ్స అకాడమీలో శిక్షణ పొంది, 2003లో ఇండియ¯ŒS మిలిటరీ అకాడమీ (డెహ్రడూ¯ŒS)లో చేరి, ఆఫీసర్ కమిష¯ŒS్డతో లెఫ్టినెంట్ హోదా పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత సైన్యంలో మేజర్ హోదాలో పనిచేస్తున్నాడని తెలిపారు. తమ కుటుంబంలో ఎవరూ ఆర్మీలో లేకపోయినా కుమారుడిని చేరేందుకు ప్రోత్సహించినట్లు తెలిపారు.
సర్జికల్ దాడుల్లో ధైర్యసాహసాలు
భారత –పాకిస్థా¯ŒS సరిహద్దు రేఖ అయిన లై¯ŒS ఆఫ్ కంట్రోల్‌ని దాటి అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత సైన్యం సర్జికల్ దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో మేజర్ వీరనరేష్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారు.ఈ నేపథ్యంలో మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన వీరనరేష్‌కు భారతప్రభుత్వం సేనామెడల్‌ను ప్రదానం చేసింది. ఈ మెడల్ పొందిన 91 మందిలో నరేష్ మూడవ వ్యక్తి కావడం విశేషం.