చెత్తకుండిలో పేలుడు సంభవించి వీరవాణి (15) అనే బాలికతోపాటు మరో మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన యానాంలోని సావిత్రి నగర్లో నిన్న చోటు చేసుకుంది. ఆ ఘటనలో మహిళకు స్వల్పగాయాలు కాగా, బాలికను తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఆ బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్య సాయం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆ బాలికను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చెత్త కుండిలో పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మందుగుండి సామాగ్రిని చెత్తకుండిలో వేయడం వల్లే ఆ ఘటన చోటు చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.