సముద్రంలో గల్లంతైన వ్యక్తి సురక్షితం
Published Tue, Dec 13 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
కాకినాడ రూరల్ /యానాంటౌన్ :
వార్దా తుపానుతో ఆదివారం ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగలో బోటు తిరగబడి గల్లంతైన ఇద్దరిలో ఒకరు సురక్షితంగా Výæట్టుకు చేరారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటకు చెందిన ఇద్దరు సముద్రంలో బోటు తిరగబడడంతో గల్లంతైన సంగతి తెలిసిందే. వారిలో గంపల అచ్చారావు (25) అలల ఉధృతికి కొట్టుకుపోయి సుమారు ఆరు గంటల సేపు ఈదుతూ మడ అడవుల్లోకి వెళ్లిపోయాడు. అక్కడ చెట్టును పట్టుకొని ఉన్న అచ్చారావును సోమవారం పీతల వేటకు వెళ్లిన జాలర్లు చూశారు. ఆ విషయం మత్స ్యశాఖాధికారులకు వారు తెలియజేశారు. అధికారుల సాయంతో వారు అచ్చారావును భైరవపాలెం ఒడ్డుకు తీసుకువచ్చారు. నీటిలో నానిపోయిన అచ్చారావు ఒంటిపై గాయాలు ఉండడంతో అతనికి అక్కడ ప్రాథమిక చికిత్స చేసి యానాం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్టు మత్స్యశాఖ డీడీ ఎస్. అంజలి, ఏడీఏ కె. కనకరాజు, ఏఈ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. అచ్చారావు జాడ తెలియడంతో పెద్దలు వంకా సింహాద్రి, సూరాడ రాజు, మైలపల్లి జగన్నాథం, మాజీ సర్పంచ్ కోమలి సత్యనారాయణ యానాం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అచ్చారావును కలసి మనోధైర్యాన్ని కలుగజేశారు. కాగా సముద్రంలో గల్లంతైన ఓసుపల్లి మహేంద్ర (19) జాడ ఇంకా తెలియరాలేదు.
స్థానిక ఇ¯ŒSచార్జి పరిపాలనాధికారి కాలే సాయినాథ్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గూటం శివగణేష్ సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి అచ్చారావు ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అచ్చారావు బంధువులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
Advertisement
Advertisement