తెలుగు కథ మరింత పరిపుష్టం కావాలి
Published Sat, Dec 10 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
యానాం టౌ¯ŒS :
తెలుగు కథ మరింత పరిపుష్టం కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మిదేవి తెలిపారు. సర్వశిక్ష అభియా¯ŒS సమావేశ మందిరంలో సాహిత్య అకాడమీ, స్థానిక స్ఫూర్తి సాహితీ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలుగు రచయితల సమావేశంలో భాగంగా ‘కథానికా పఠనం – నేటి తెలుగు కథ’ అంశంపై ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా సంవత్సరానికి రెండు వేల కథలు వస్తున్నాయన్నారు. వాటిలో ఏరితే మంచి కథలు వందకు మించి ఉండటం లేదని చెప్పారు. క్షీణిస్తున్న మానవ సంబంధాలు, వృద్ధాప్య సమస్యలు తదితర అంశాలపై చాలా మంది కథలు రాస్తున్నారని చెప్పారు. రాసి లాగే వాసి కూడా పెరిగితే తెలుగు కథ మరింత పరిపుష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. సభకు అ««దl్యక్షత వహించిన స్ఫూర్తి సాహితీ సమాఖ్య అధ్యక్షుడు, కవి, కథకుడు దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ కథ జీవన వాస్తవికతను, మానవ సంబంధాల విధ్వంసం, ఆచార వ్యవహారాలు, సామాజిక సమస్యలను, అంతరంగిక విషయాలను ప్రతిబిం బించే ప్రక్రియ అని చెప్పారు. ప్రస్తుతం కథలలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. ప్రముఖ కథకుడు చింతకింది శ్రీనివాసరావు ‘మా దేవుడుమాయ బొగట్టా’ అనే కథను, కవి, కథకుడు అద్దేపల్లి ప్రభు ‘సీతక్కకొండ’ కథను, జి.లక్ష్మి ‘కళాకారుడు’ కథను, దాట్ల దేవదానంరాజు ‘గోదాట్లో గోదారి’ కథలను తమదైన శైలిలో వినిపించి అలరించారు.
కవిత్వం మనిషిని స్పందింపజేస్తుంది
అనంతరం కవితా పఠనం–నేటి తెలుగు కవిత్వం అంశంపై జరిగిన సదస్సులో సాహితీ విమర్శకులు ఎం.నారాయణశర్మ మాట్లాడుతూ ప్రస్తుతం సారవంతమైన కవిత్వం వస్తుందని తెలిపారు. సమకాలీన అంశాలపై కవులు కవిత్వం రాస్తున్నారన్నారు. సభకు అధ్యక్షత వహించిన కవి డాక్టర్ శిఖామణి మాట్లాడుతూ కవిత్వం మనిషిలోని పశు లక్షణాలను దూరం చేసి సౌజన్యమూర్తిగా మారుస్తుందని చెప్పా రు. వచన కవిత్వానికి 70 ఏళ్లు నిండాయ న్నారు. సమాజం ఉన్నతికి కవిత్వం అవసరమన్నారు. కవులు డాక్టర్ ఎ¯ŒS.గోపి, ఎండ్లూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వి.భాస్కరరెడ్డి వందన సమర్పణ చేశారు.
Advertisement
Advertisement