గోదావరిలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురి మృతి | five die as car rams into godavari river | Sakshi
Sakshi News home page

గోదావరిలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురి మృతి

Published Sat, Dec 12 2015 9:13 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

గోదావరిలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురి మృతి - Sakshi

గోదావరిలోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురి మృతి

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా యానాం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. యానాం శివారు దరియాలతిప్ప ఏటిగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. గతరాత్రి  ఇండికా కారు ( ap 5V 201) అదుపు తప్పి గోదావరి నదిలో పడిపోయింది.  కారు వేగంగా వెళ్లి అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయింది. అయితే చీకటి కావడంతో ఎవరూ గమనించలేదు. తెల్లవారు జామున కారు నీటిలో తేలుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును వెలికి తీశారు ఈ దుర్ఘటనలో అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ యువకుడు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  మృతులంతా కాకినాడ తూరంగిలోని  డ్రైవర్ కాలనీకి చెందినవారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement