
టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా అమ్మమ్మ రాజేశ్వరీదేవి మృతి చెందారు. తణుకు మాజీ ఎమ్మెల్యే, దివంగత వైటీ రాజా తల్లి, ప్రముఖ పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరి భార్య రాజేశ్వరి దేవి అనారోగ్యంతో కన్నుమూశారు. సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో ఆమె అంత్యక్రియలు జరిగాయి. రానాతో పాటు దగ్గుబాటి సురేష్ కూడా ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. రానాకు రాజేశ్వరీదేవి స్వయానా అమ్మమ్మ కావడంతో పాడె మోశారు. రానా దగ్గుబాటి తల్లి లక్ష్మీ పుట్టింటి ఫ్యామిలీ రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ప్రముఖంగా ఉన్నారనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment