
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. జాతీయ రహదారి సమీపంలో దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత సంచరించినట్లు ఆనవాళ్లను గుర్తించారు.
చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment