
జిల్లా కలెక్టర్ స్పందనలలో రాజీనామా సమర్పిస్తున్న మార్గాణి అమ్మాణీ
సాక్షి, తూర్పుగోదావరి(కడియం): స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలి పదవికి మార్గాని అమ్మాణీ (జనసేన) రాజీనామా చేశారు. ఈ మేరకు కలెక్టర్ సి.హరికిరణ్‌కు సోమవారం రాజీనామా లేఖ అందజేసినట్లు ఆమె తెలిపారు. భర్త ఏడుకొండలుతో కలిసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ గతేడాది నామినేషన్ వేసినా ఎన్నిక వాయిదా పడడంతో కడియపులంక సర్పంచ్ పదవికి పోటీ చేసి గెలిచానన్నారు. ఇటీవల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా గెలిచానన్నారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సర్పంచ్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీంతో జిల్లాలో జనసేనకు ఉన్న ఏకైక జెడ్పీటీసీ లేనట్టే.
Comments
Please login to add a commentAdd a comment