
సాక్షి, వైఎస్సార్ : జనసేన పార్టీలోని అసమ్మతి సెగలు బయటపడ్డాయి. డబ్బులున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నాయకుడు మాలే శివ ఆధ్వర్యంలో బుధవారం దాదాపు 70 మంది సీనియర్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం శివ మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులున్న వారికే పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప అసెంబ్లీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ తమను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేపు(గురువారం) జరగబోయే పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనేది లేదని ఆయన స్పష్టం చేశారు.