పవన్‌ ఇదేం పని? | Voters angry on Pawan Kalyan for Directly penetrating into the polling booth | Sakshi
Sakshi News home page

పవన్‌ ఇదేం పని?

Published Fri, Apr 12 2019 5:01 AM | Last Updated on Fri, Apr 12 2019 5:01 AM

Voters angry on Pawan Kalyan for Directly penetrating into the polling booth - Sakshi

ఓటర్లను నెట్టివేస్తూ వెళ్తున్న పవన్‌ వ్యక్తిగత సిబ్బంది

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రతి విషయంలోనూ సమాజానికి ఆదర్శంగా ఉంటానని సుద్దులు చెప్పే పవన్‌కల్యాణ్‌ వ్యవహరించిన తీరుకు ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఓటర్ల నుంచి స్పందన కరువైంది. మొదట ఆయన సాధారణ ప్రజల మాదిరిగా లైనులో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటారని అక్కడకు చేరుకున్న జనసేన నాయకులు చెప్పారు.

అయితే ఆయన కేంద్రానికి వచ్చినపుడు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో.. అసహనానికి గురై నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని నిమిషాల వ్యవధిలోనే మీడియాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎప్పటి నుంచో ఓటు వేయడానికి లైన్‌లో వేచి ఉన్న ఓటర్లు పవన్‌ వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? అతనికో రూలు మాకో రూలా అంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పవన్‌ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్‌లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement