
నెల్లూరులో జనం లేక వెలవెలబోతున్న పవన్ సభ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తన రాజకీయ ఆలోచనలకు బీజం పడింది నెల్లూరులోనేనని.. తన సొంతూరు కూడా అదే అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతుంటారు. అలాంటి చోట మంగళవారం నిర్వహించిన బహిరంగ సభ జనం లేక అట్టర్‌ఫ్లాప్‌గా మారింది. తన పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు నగరంలో ప్రచారాన్ని ప్రారంభించేందుకు జీపీఆర్ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ఖాళీస్థలంలో భారీ ఏర్పాట్లతో సభ నిర్వహించారు. అయితే ఈ సభకు ఆశించిన మేర జనం రాలేదు.
జనం లేకపోవడంతో జనసేనాని హడావుడి ప్రసంగం చేశారు. అభ్యర్థుల పరిచయంతో సాగిన సభ తీరుకు అభిమానులు సైతం నిరాశకు గురయ్యారు. హడావుడిగా జనసేన పార్టీ, బీఎస్‌పీ, వామపక్షాల కూటమికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేసి తాను అధికారంలోకి వస్తే ప్రజలకు చేకూర్చే ప్రయోజనాలను వాగ్దానాలుగా ఉన్న కొద్దిపాటి జనానికి వివరించి కోవూరు సభకు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment