గోదావరి వరద ఉద్ధృతి.. కూలిపోయిన 'సినిమా' చెట్టు | Kovvuru Cinema Tree Collapsed | Sakshi
Sakshi News home page

Cinema Chettu: టాలీవుడ్‌కి అచ్చొచ్చిన సినిమా చెట్టు ఇక లేదు

Published Mon, Aug 5 2024 6:18 PM | Last Updated on Mon, Aug 5 2024 7:29 PM

Kovvuru Cinema Tree Collapsed

దాదాపు 100కి తెలుగు సినిమాల్లో కనిపించిన పెద్ద చెట్టు.. గోదావరి నది వరద ఉద్ధృతికి కూలిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లపూడి దగ్గరలోని కుమారదేవం గ్రామంలో నది ఒడ్డున నిద్ర గన్నేరు చెట్టు ఉంది. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని దాదాపు 145 నుంచి ఉన్న ఈ చెట్టు దగ్గర చాలా షూటింగ్స్ జరిగాయి. దీంతో ఇది కాస్త సినిమా చెట్టుగా పేరు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో నేరుగా రిలీజ్)

పాడిపంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలా రాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే 108కి పైగా సినిమా సీన్స్ ఇక్కడ తీశారు. అలానే ఈ చెట్టు కింద సీన్ తీస్తే సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా టాలీవుడ్‌లో ఉంది. ప్రముఖ దర్శకుడు వంశీ అయితే తన 18 సినిమాల్లో ఈ చెట్టుని చూపించారు. రాఘవేంద్రరావు, దాసరి, జంధ్యాల, ఈవీవీ కూడా ఈ చెట్టు సెంటిమెంట్ ఫాలో అయ్యారు.

చివరగా రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా సీన్‌ని ఇక్కడ తీశారట. ఇక ఈ చెట్టు కూలిపోయిన వార్త తెలిసి.. తెలుగు ప్రేక్షకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన జ్ఞాపకాల్ని పంచుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement