ఓటీటీలో మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో నేరుగా రిలీజ్ | Birthmark Telugu Movie OTT Streaming Details | Sakshi
Sakshi News home page

Birthmark OTT: డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Mon, Aug 5 2024 4:41 PM | Last Updated on Mon, Aug 5 2024 5:22 PM

Birthmark Telugu Movie OTT Streaming Details

ఓటీటీలోకి అప్పుడప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. ఇతర భాషల్లో ఆకట్టుకున్న చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులోకి వస్తుంటాయి. అలా తమిళ ప్రేక్షకుల్ని అలరించిన ఓ మూవీ ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది?

(ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్ రూమర్.. ఇంతలోనే హీరోయిన్ బ్రేకప్!)

'జైలర్' మూవీలో రజనీకాంత్ కోడలిగా మిర్నా మేనన్ నటించింది. ఈమె ప్రధాన పాత్ర చేసిన మూవీ 'బర్త్ మార్క్'. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళంలో రిలీజైంది. నెలలోనే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడీ సినిమానే తెలుగులో ఆగస్టు 8 నుంచి ఆహా ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని పోస్టర్ రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించారు. వెరైటీ మూవీ ఏదైనా చూద్దామనుకునేవాళ్లకు ఇదో ఆప్షన్.

'బర్త్ మార్క్' విషయానికొస్తే.. జెన్నీ(మిర్నా మేనన్) ప్రెగ్నెన్సీతో ఉంటుంది. భర్త డేనీ ఈమెని మారుమూల కొండల్లోని ఓ గ్రామానికి తీసుకొస్తాడు. టెక్నాలజీ, నాగరికతకు చాలా దూరంగా ఉండే ఈ ప్రాంతంలో భార్య ప్రసవించాలనేది డేనీ కోరిక. కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత డేని వింతగా ప్రవర్తిస్తుంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫుడ్‌కి ఫిదా అయిన ఆరో హీరోయిన్.. ఏం చెప్పిందంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement