
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం ఘటనపై మరింత వేగంగా దర్యాప్తు జరపాలని ఆ జిల్లా ఎస్పీని డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఆదేశించారు. డీజీపీ ఇంకా ఏమన్నారంటే..
► ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.
► సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే దర్యాప్తు చేపట్టాం. ఈ కేసులో ఎస్సై, కానిస్టేబుల్స్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు కేసు నమోదు చేశాం.
► ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం.
► నేరానికి పాల్పడినవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు.
► ఘటనపై దర్యాప్తు పూర్తి చేశాక దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
► ఈ ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతాం.