హిందూపురం లోక్‌సభ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం లభించింది. తీవ్ర ఉత్కంఠ రేపిన మాధవ్ నామినేషన్‌ను మంగళవారం ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.