అధికార తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి మరోసారి బయటపడింది.
అనంతపురం: అధికార తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి మరోసారి బయటపడింది. అనంతపురం జిల్లా గోరంట్లలో టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు సోమవారం సీజ్ చేశారు. కళ్యాణ మంటపం నిర్మాణానికి 500 ట్రాక్టర్ల ఇసుకను హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప బంధువు యువశేఖర్ ఇంటి వద్ద నిల్వ ఉంచారు.
అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.