sankara narayana
-
‘ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది’
సాక్షి, విజయవాడ: గత టీడీపీ పాలనలో ప్రచారార్భాటమే తప్ప.. ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా, నగర బీసీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ సభలో పెద్దిరెడ్డితో పాటు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ నగర అర్బన్ అధ్యక్షులు బొప్పన భవకుమార్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో చెప్పిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారని చెప్పారు. టీడీపీకి వెన్నెముక లంటూ బీసీలను చంద్రబాబు కేవలం ప్రచార్భాటానికే వాడుకున్నారని మండిపడ్డారు. బీసీలకు వైఎస్ జగన్ చేసిన విధంగా చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు. బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కృష్ణ లంక లోని ప్రజల ఇళ్ళ పట్టాలు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తండ్రి బాటలో జగన్ నడుస్తున్నారు.. విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఫూలే అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం వైఎస్ జగన్..విద్యను పటిష్టం చేసేలా పాఠశాల దశ నుంచే చర్యలు చేపట్టారన్నారు. పేదల బిడ్డల చదువుకు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన ఘనత వైఎస్సార్‌ది అని.. ఆయన తనయుడు వైఎస్ జగన్ ఆయన బాటలోనే నడుస్తూ ఫూలే ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది.. ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలకు క్యాబినెట్లో 60 శాతం మంత్రి పదవులు ఇచ్చి సీఎం జగన్ తన చిత్తశుద్ధిని నిలుపుకున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. 2024లో మళ్లీ సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదర్శనీయుడు జ్యోతిరావు ఫూలే.. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జ్యోతిరావు ఫూలే ఆదర్శనీయుడని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. అధికారికంగా ఫూలే వర్ధంతిని నిర్వహించిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. అణగారిన వర్గాలకు సీఎం 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు.. ఇద్దరు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం శుభపరిణామం అని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు సామాజిక స్ఫూర్తి నింపిన వ్యక్తి ఫూలే అని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైఎస్సార్ పెద్దపీట వేశారని.. ఆయన మరణంతో ఆగిన గుండెల్లో అత్యధికులు ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చెందిన వారేనని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారన్నారు. 60 శాతం ఉద్యోగాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకే వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో జ్యోతిరావు ఫూలే స్మృతివనం ఏర్పాటు చేయాలని జంగా కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. -
కృష్ణాజలాలతో చెరువులన్నీ నింపుతాం
సాక్షి, జీడిపల్లి(అనంతపురం) : కరువు జిల్లా అనంతకు హంద్రీనీవా వరంలాంటిదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతోనే హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు జిల్లాకు వస్తున్నాయన్నారు. ఆ మహానేతను జిల్లా వాసులెప్పటికీ మరువలేరన్నారు. బుధవారం ఆయన బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశ కాలువకు నీటిని విడుదల చేశారు. అంతకుముందు హెడ్‌రెగ్యులేటర్ వద్ద అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రైతు మిషన్ సభ్యుడు రాజారాంలతో కలిసి మంత్రి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ కృష్ణా జలాలతో జిల్లాలోని అన్ని చెరువులను నింపి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ వెంకటరమణ మాట్లాడుతూ జీడిపల్లి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1.68 టీఎంసీలు కాగా, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1.60 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతానికి రెండో దశ కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేశామని, 24 గంటల తర్వాత ఇన్‌ఫ్లో ఆధారంగా 600 క్లూసెక్కుల మేర విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో హంద్రీనీవా ఈఈ నారాయణ నాయక్, డీఈ వెంకటేశ్వర్లు, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వలంటీర్ల చేతుల్లోకి నియామక పత్రాలు
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నిరుద్యోగుల కల ఫలించింది. ఏ పనీలేక ఇంట్లో వారికి భారమైన వారికి ఆ బాధ దూరమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వార్డు వలంటీర్ల పోస్టులను భర్తీ చేయడంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. శనివారం జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల్లో వార్డు వలంటీర్లుగా ఎన్నికైన వారికి ఆయా కమిషనర్లు నియామక పత్రాలను అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామని వారు ఆనందంలో తేలిపోయారు. కిక్కిరిసిన నగరపాలక సంస్థ, మునిసిపాలిటీలు జిల్లాలోని వివిధ మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థ వార్డు వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులతో కిక్కిరిపోయింది. ఉదయం 8 గంటల నుంచే నియామక పత్రాలిస్తారని వార్డు వలంటీర్లు ఎదురుచూశారు. నియామకపత్రాలకు సంబంధించి ఈ నెల 2న ఆయా మునిసిపాలిటీల అధికారులు మెసేజ్‌లు పంపారు. దాని ఆధారంగా ఏఏ ప్యానెల్లో వారు ఇంటర్వ్యూలకు హాజరయ్యారో అక్కడే నియామకపత్రాలు తీసుకున్నారు. మునిసిపల్ ఆర్డీ, ఇన్చార్జ్ కమిషనర్ అలీంబాషా, తదితర అధికారులు ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ చెన్నుడు, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, ఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస రావు, ఏసీపీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 20979 నియామక పత్రాలు అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మునిసిపాలిటీల్లో మొత్తం 20,979 మందికి నియామక పత్రాలను అందజేసిన ట్లు మునిసిపల్ ఆర్డీ అలీంబాషా పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీల్లో 5,465 మందికి నియామకపత్రాలు అందజేశామన్నారు. వీరికి ఈ నెల 6 నుంచి 9 వరకు శిక్షణ ఉంటుందని, శిక్షణ కేంద్రాల వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఇంటి వద్దకే సేవలు : మంత్రి శంకరనారాయణ పెనుకొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర బీసీసంక్షేమ శాఖామాత్యులు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన మండల పరిషత్ భవనంలో వలంటీర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదట సారిగా గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక నేత జగనేనన్నారు. ప్రజలు తమ పనులపై ప్రభుత్వకార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగకుండా వారి ఇంటి వద్దే సేవలు అందించేందుకు సీఎం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా 72 గంటల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఒకేసారి 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పారదర్శకంగా పాలన గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాయని మంత్రి విమర్శించారు. పాలనలో పారదర్శకత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని, నిజాయితీగా పని చేయాలని సూచించారు. ఎంపీడీఓ శివశంకరప్ప, కార్యదర్శి అశ్వర్థప్ప, మండల కన్వీనర్లు శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నాగలూరుబాబు, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాలరెడ్డి, టౌన్ కన్వీనర్ తయూబ్ తదితరులు పాల్గొన్నారు. కొలువుల జాతర 12,373 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అనంతపురం టవర్‌క్లాక్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వలంటీర్ల నియామకం పూర్తయ్యింది. జిల్లాలో 896 గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగా, ఇంకా వాటి సంఖ్య పెంచుతూ 912 సచివాలయాలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో మొత్తం 14,007 వలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం 15,218 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రతిపాదన పంపారు. నిరుద్యోగుల నుంచి ఏకంగా 58,382 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 56,707 మంది అర్హత సాధించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు శనివారం నియామక ఉత్తర్వులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 12,737 మందిని గ్రామ వలంటీర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేసినట్లు జిల్లా పరిషత్ సీఈఓ శోభాస్వరూపరాణి తెలిపారు. సీఎం దేవుడిలా అవకాశం ఇచ్చారు టైలర్ పని చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్నా. ప్రభుత్వ పథకాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాకు కల్పించారు. ఉద్యోమంటే మాలాంటోళ్లకు సాధ్యపడదని అనుకున్నాం. ప్రజలకు సకాలంలో సేవలు అందిస్తా. – ద్వారకనాథ్, ఓబుళదేవనగర్ అదృష్టంగా భావిస్తున్నా వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. ఉపాది లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉపాధి కల్పించడం మాలాంటి నిరుద్యోగులకు అదృష్టంగా భావిస్తున్నాం. ఆర్థికంగా ఊరట లభిస్తుంది. – రాశి, నేతాజీ నగర్ హామీ నిలబెట్టుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తరహాలో ఇచ్చిన మాట తప్పలేదు. వార్డు వలంటీర్లు, సెక్రటేరియట్లలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడం సీఎం గొప్పతనమే. వార్డు వలంటీర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. – శ్రీ బాలాజీ, జీసస్‌నగర్ ధన్యవాదాలు వార్డు వలంటీర్లుగా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్‌కు ధన్యవాదాలు. విద్య, వైద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళలకు ఆయన సముచిత స్థానం కల్పిస్తున్నారు. మహిళా సాధికారతకు ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగాలు దోహదపడతాయి. –స్రవంతి, నీరజ అంబేద్కర్‌నగర్ -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి శంకరనారాయణ
వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి శంకరనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం చెన్నేకొత్తపల్లిలో జరిగిన రైతు దినోత్సవంలో కలెక్టర్ సత్యనారాయణతో కలిసి వారు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. అంతకుముందు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్‌కట్ చేసి పంచిపెట్టారు. సాక్షి, కనగానపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మండల కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, రాష్ట్ర వ్యవసాయశాఖ మిషన్ సభ్యులు బోయ నరేంద్ర హాజరయ్యారు. జలయజ్ఞం పేరుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిన వైఎస్సార్ రైతు బాంధవుడయ్యారని మంత్రి గుర్తు చేశారు. అందుకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి రైతుల సంక్షేమం అనేక పథకాలను ప్రకటించారన్నారు. ‘రైతు భరోసా’ కింద పంట పెట్టుబడి కోసం ఏటా రూ.12,500, వడ్డీ లేని పంట రుణాలు, ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం తిరిగి రావాలని ప్రజలంతా వైఎస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన కలలను సాకారం చేసేందుకు పాటుపడతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాప్తాడు నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిత్యం కరువుతో అల్లాడుతున్న చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లో కొత్తగా సాగునీటి రిజర్వాయర్లు నిర్మించటంతో పాటు, త్వరలోనే పేరూరు డ్యాంను కృష్ణా జలాలతో నింపుతామన్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళల డ్వాక్రా రుణాలను మాఫీ చేయటంతో పాటు ‘అమ్మఒడి’ పథకం ద్వారా విద్యాభివృద్ధి కృషి చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. వ్యవసాయ, వాటి అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, జేడీఏ హబీబ్‌బాషా, వైఎస్సార్సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, బిల్లే ఈశ్వరయ్య, గంగుల భానుమతి, సానే ఉమాదేవి, రాజారెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘తమ్ముళ్ల’ ఇళ్లలో సిరుల వర్షం
పంట సంజీవని ‘పచ్చ’ తమ్ముళ్లకు వరాలిచ్చింది. కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన పరికరాలు నేతల ఇళ్లలో సిరుల వర్షం కురిపించాయి. రైతుల ప్రయోజనాలను గాలికొదిలి ఏకంగా సొంత ఆస్తిలా అమ్ముకున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అప్పట్లో టీడీపీ అధికార పార్టీ కావడంతో అధికారులు కూడా నోరు తెరవలేని పరిస్థితి. ఇప్పుడు డొంక కదులుతోంది. ఖరీఫ్ సీజన్ కావడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రెయిన్గన్లు ఎక్కడని వ్యవసాయాధికారులను ప్రశ్నిస్తే.. మౌనమే సమాధానమవుతోంది. సాక్షి, అనంతపురం : వరుణదేవుడు కరుణించకపోయినా పంటలను కాపాడుతామని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెయిన్గన్లను తెరపైకి తీసుకొచ్చారు. 2016లో వీటిని ప్రారంభించారు. ఆ ఏడాది దాదాపు 15.15లక్షల ఎకరాల్లో పంటసాగైతే మొత్తం పంట ఎండిపోయింది. ఆ సందర్భంగా బాబు నాలుగురోజులు జిల్లాలోనే తిష్టవేసి పంటను కాపాడినట్లు మసిపూసి మారేడుకాయ చేశారు. ఏకంగా సీఎం తరలిరావడంతో బెంబేలెత్తిన అధికారులు రెయిన్గన్లను ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు. అయినప్పటికీ ఎకరా పంటను కూడా కాపాడలేకపోయారు. దీంతో వీటివల్ల ఉపయోగం లేదని తేల్చారు. ఇది ఓ విఫలప్రయత్నం అని, రెయిన్గన్లతో చెడ్డపేరు తప్ప మరొకటి లేదని గ్రహించిన ప్రభుత్వం వాటి ఊసెత్తడమే మరిచింది. ఇక అధికారులు కూడా ఆ తంతు ముగిసనట్లేనని భావించి పరికరాల రికవరీని పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మంత్రి శంకరనారాయణ ఇటీవల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి రెయిన్గన్ల ప్రస్తావన తీసుకొచ్చారు. పరికరాలు ఎక్కడని జేడీని ప్రశ్నించారు. అందుకాయన రైతుల వద్దే ఉన్నాయని చెప్పలేక చెప్పారు. అవి ప్రభుత్వానివా? ప్రయివేటువా? కార్యాలయాల్లో ఎందుకు లేవు? అని తిరిగి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో జేడీఏ నుంచి సమాధానం కరువైంది. ఈ నేపథ్యంలో రెయిన్గన్లు ఎక్కడనే విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే 30 శాతం కూడా అధికారుల వద్ద లేవని తేలింది. 70 శాతం పైగా పరికరాలను రైతుల పేరుతో టీడీపీ నేతలు విక్రయించి సొమ్ము చేసుకోవడం గమనార్హం. అధికారుల ఉరుకులు పరుగులు అధికారపార్టీ ఎమ్మెల్యేలు వీటి ప్రస్తావన తేవడంతో వ్యవసాయాధికారులు రికవరీపై దృష్టి సారించారు. నాలుగురోజుల్లో రెయిన్గన్లపై పూర్తి వివరాలు కావాలని ఏఓలు, ఏడీలను జేడీ హబీబ్‌బాషా ఆదేశించారు. అయితే అధికారులంతా బదిలీల్లో తలమునకలై ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే పరిస్థితి కరువైంది. రికవరీ కాకపోతే కొత్త ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. దీంతో బాధ్యులైన టీడీపీ నేతలను తేల్చి, అవసరమైతే వారిపై కేసులు నమోదు చేసి రికవరీ చేసే యోచనలో వ్యవసాయాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ రెయిన్గన్ల పరిస్థితి జిల్లా వ్యాప్తంగా 6,426 రెయిన్గన్లు, 5,894 స్ప్రింక్లర్లు, 4,17,000 పైపులు, 4478 ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. వీటిని రూ.69.79కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే వీటిలో ఏడాదికే 20శాతం రెయిన్గన్లు ఆచూకీ లేకుండా పోయాయి. 2019 ఖరీఫ్ వచ్చే సమయానికి వీటిలో 30శాతం కూడా లేని పరిస్థితి. రెయిన్గన్లు రైతులు తీసుకున్న తర్వాత పనిముగించుకుని మరో రైతుకు ఇచ్చారు. ఆ రైతు ఇంకో రైతుకు ఇచ్చారు. ఇలా రెయిన్గన్లు చేతులు మారాయి. ఈ ప్రక్రియ ఆయా గ్రామాల్లోని స్థానిక అధికారపార్టీ నేతల కనుసన్నల్లో సాగింది. వారివద్దకు వెళ్లిన వారికే రెయిన్గన్లు ఇచ్చారు. ఆ తర్వాత రైతులు తిరిగి అధికారపార్టీ నేతలకు అప్పగించారు. టీడీపీ నేతల వద్ద రెయిన్గన్లు ఉన్నట్లు వ్యవసాయాధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో వీటిని అధికారపార్టీ నేతలు కర్ణాటక రైతులకు విక్రయించారు. ఈ విషయం అప్పట్లో పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటికి మేల్కొన్న అధికారులు రికవరీపై దృష్టి సారించారు. ఏఓలు, ఎంపీఈఓలను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపగా.. మెజార్టీ పరికరాలు రైతుల వద్ద లేవని, అధికారపార్టీ నేతల ఇళ్లలోనే ఉన్నాయనే విషయం వెల్లడైంది. కొందరు నేతలు పరికరాలు ఇచ్చేయగా.. ఇంకొందరు అతిబలవంతంగా పగిలిపోయిన పైపులు, ప్రభుత్వం పంపిణీ చేసిన పైపులు కాకుండా వేరే పైపులు, పనిచేయకుండా తుక్కుగా మారిన ఆయిల్ ఇంజన్లను చేతుల్లో పెట్టి పంపారు. ఆ మేరకు అతికష్టం మీద కొన్ని రికవరీ అయ్యాయి. తర్వాత ఏడాది కూడా ప్రణాళిక లేకుండా పంపిణీ జరిగింది. అంతే ఇక రెయిన్గన్లు జాడ లేకుండాపోయాయి. రాప్తాడు, తాడిపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, రాయదుర్గం నియోజకవర్గాల్లో అధికంగా రికవరీ కావల్సి ఉంది. -
'వైఎస్ జగన్ పోరుబాటను విజయవంతం చేయండి'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా వైఎస్ జగన్ ధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు అనంతరపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్‌నారాయణ పిలుపు నిచ్చారు. అక్టోబర్ 4వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలసి వైఎస్ జగన్ మహాధర్నా నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పోరు బాట చేపట్టిన సంగతి తెలిసిందే. -
500 ట్రాక్టర్ల ఇసుక సీజ్
అనంతపురం: అధికార తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి మరోసారి బయటపడింది. అనంతపురం జిల్లా గోరంట్లలో టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికారులు సోమవారం సీజ్ చేశారు. కళ్యాణ మంటపం నిర్మాణానికి 500 ట్రాక్టర్ల ఇసుకను హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప బంధువు యువశేఖర్ ఇంటి వద్ద నిల్వ ఉంచారు. అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. -
పార్టీ పటిష్టతకే సమీక్షలు
సాక్షి, తిరుపతి: పార్టీ నిర్మాణాన్ని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల సమీక్షకు వచ్చామని త్రిసభ్య కమిటీ సభ్యులు శంకరనారాయణ, గుర్నాథరెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో పార్టీ ఎన్నికల గెలుపు ఓటములపై సమీక్ష జరిపేందుకు 14 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని పీఎల్ఆర్గ్రాండ్ హోట ల్లో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి అధ్యక్షత వహించగా, పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యు లు భూమన కరుణాక రరెడ్డి, ఎమ్మెల్యేలు చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి(చంద్రగిరి), అమరనాథరెడ్డి(పలమనేరు), తిప్పారెడ్డి(మదనపల్లె), సునీల్‌కుమార్(పూతలపట్టు), చింతలరామచంద్రారెడ్డి(పీలేరు)తో పాటు, ఎన్నికల్లో పోటీచేసి ఓడిన అభ్యర్థులు బియ్యపు మధుసూదన్‌రెడ్డి(శ్రీకాళహస్తి), ఆదిమూలం(సత్యవేడు), చంద్రమౌళి (కుప్పం), జంగాలపల్లి శ్రీనివాసులు(చిత్తూ రు) హాజరయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారు, పార్టీక్యాడర్ కూడా పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. ఈ సమావేశంలో తొలుత పరిశీలకులు శంకరనారాయణ మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు విజయాలు, అపజయాలపై సమీక్షించేందుకు వచ్చామన్నారు. పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల అత్యధిక మెజారిటీతో గెలిచారని ఇందుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయమే ఉదాహరణ అన్నారు. అలాగే మరికొన్ని చోట్ల అత్యధిక తేడాతో ఓడారని దీనికి కారణాలు ఏంటనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నాలుగు సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం వారితోనే ఉండి సమస్యలపై పోరాడుతున్నారన్నారు. మనపార్టీ బలాన్ని తగ్గించేందుకు, పార్టీ నుంచి చాలా మంది వె ళ్లిపోతారనే దుష్ర్పచారాన్ని టీడీపీ, వారి అనుకూల పత్రికలు పదే, పదే చేస్తున్నాయని వారి కల నెరవేరదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ తరహా ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మరో పరిశీలకులు బి.గుర్నాథరెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అన్ని రకాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలను సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించేందుకే జగన్మోహన్రెడ్డి త్రిసభ్య కమిటీని నియమించారన్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షించి వచ్చే సారాంశాన్ని నేరుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డికి అందిస్తామని, కార్యకర్తలు, నాయకులు ఎన్నికల్లో వైఫల్యాలకు సంబంధించి తమ అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెప్పాలన్నారు. పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టం చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. పరిశీలకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను నియోజకవర్గాల వారీగా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్రమోడి ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంత ఉంటుందని ఊహించకపోవటం, కొన్ని చోట్ల రుణమాఫీ ప్రభావం కూడా పనిచేసిందన్నారు. అలాగే మనల్ని మనం కొన్ని చోట్ల అతిగా అంచనా వేసుకోవటం కూడా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఓటమికి కారణమైందన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి రాకుండా చూసేందుకు అన్ని రాజకీయపార్టీలు, మీడియాలోని కొన్ని పత్రికలు పనిగట్టుకుని మూకుమ్ముడిగా అడ్డుకున్నాయన్నారు. క్యాడర్ క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేయబట్టే పార్టీకి పెద్ద సంఖ్యలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే స్థానాలు దక్కాయన్నారు. రానున్న ఐదేళ్లు పార్టీ తరఫున ప్రజాసమస్యలపై నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. పార్టీ విప్ చెల్లుతుందనే విషయం కింది స్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. ఎవరైనా పార్టీ ఫిరాయింపునకు పాల్పడాలని చూస్తే వారిపై విప్ జారీ చేస్తే అనర్హతకు గురవుతారనేది గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఎన్నికల సమీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పోకల అశోక్‌కుమార్, వైఎస్సార్ సీపీ అనుబంధ ప్రజాసంఘాల నుంచి ఉదయ్‌కుమార్, గాయత్రిదేవి, బీరేంద్ర వర్మ, ఖాద్రీ పాల్గొన్నారు.