
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ హిందుపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట‍్ల మాధవ్ నివాసంలో విషాదం నెలకొంది. ఆయనకు పితృ వియోగం కలిగింది. గోరంట్ల మాధవ్ తండ్రి కురుబ మాధవస్వామి(85) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కర్నూలు జిల్లా పి.రుద్రవరంలో మాధవస్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు మాధవ్ తండ్రి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.
కాగా తీవ్ర ఉత్కంఠ నడుమ గోరంట్ల మాధవ్ నామినేషన్‌కు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గోరంట్ల మాధవ్ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా, దీనిని ఆమోదించాల్సిందిగా ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం మాధవ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రిబ్యునల్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మాధవ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment