
నేను మంత్రినయ్యా.. మరి మీరు..?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాసనసభా సమావేశాలు ఒకేసారి జరుగుతుండడంతో తరచూ తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లాబీల్లో కలుసుకుంటున్నారు.
- ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలతో తలసాని శ్రీనివాస్‌యాదవ్
సాక్షి,హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శాసనసభా సమావేశాలు ఒకేసారి జరుగుతుండడంతో తరచూ తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లాబీల్లో కలుసుకుంటున్నారు. ఒకప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్‌ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావులు మంగళవారం లాబీలో ఎదురుపడ్డారు.
ఈ సందర్భంలో టీఆర్‌ఎస్‌లో చేరిన తనకు మంత్రి పదవి వచ్చిందని.. ఏపీలో అధికారంలో ఉండి కూడా మీకు మంత్రి పదవులు రాలేదని తలసాని అన్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు చిరునవ్వులు చిందిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.