గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్లలోని రావికుంట వద్ద హమాలీ వెంకటరాముడు(55) అనే వ్యక్తి బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా మృతునికి భార్యా, పిల్లలు ఉన్నారు.