venkataramudu
-
కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
అనంతపురం సెంట్రల్ : ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ. 500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. 2013 ఆగస్టు 5న నార్పల క్రాస్‌లోని బయపురెడ్డి దాబా వద్ద నార్పల మండలం దగుమర్రి గ్రామానికి చెందిన ఆదినారాయణ(42) దారుణహత్యకు గురయ్యాడు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి చెందిన హరిజన సాకే వెంకటరాముడు మరో వ్యక్తి సాకే నల్లప్పతో కలిసి అతడిని కట్టెలతో కొట్టి చంపారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాక్షులను విచారించిన అనంతరం సోమవారం ప్రధాన నిందితుడు సాకే వెంకటరాముడుకు జీవితఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రెండో ముద్దాయి సాకే నల్లప్ప అనారోగ్యంతో మృతి చెందడంతో గతంలోనే ఆయనపై కేసు కొట్టి వేశారు. బాధితుల తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణస్వామి వాదించారు. -
గోరంట్లలో వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్లలోని రావికుంట వద్ద హమాలీ వెంకటరాముడు(55) అనే వ్యక్తి బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కాగా మృతునికి భార్యా, పిల్లలు ఉన్నారు. -
అనుమానస్పదంగా వ్యక్తి మృతి
ఓడీ చెరువు : ఓడీ చెరువు మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన రాజప్పకు కుమారుడు వెంకటరమణ(53) గురువారం అనుమానస్పదంగా వతి చెందాడు. వివరాలు.. వతుడు వెంకటరమణ అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య పదిరోజుల క్రితం కూలి పనులకు బెంగళూరు వెళ్లారు. మంగళవారం రాత్రి మరో వ్యక్తితో కలసి బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చారు. అనంతరం ముగ్గురూ మద్యం సేవించేందుకు బయటకు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో వెంకటరమణ అపస్మారక స్థితిలో పడ్డాడని భార్య మంజుల, కుమారుడు రాజుకు తిరుపతయ్య తెలిపాడు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కదిరి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వతి చెందినట్లు తెలిపారు. తన తండ్రిని తిరుపతయ్య కొట్టడం వల్లే చనిపోయాడని కుమారుడు రాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడ. ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.