పాలసముద్రం చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రాగిమేకులపల్లికి చెందిన సుబ్బరాయప్ప(58) సోమవారం ఉదయం పాలసముద్రం చెరువులో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఫిట్స్ రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు తొలుత బంధువుల ఊరు వెళ్లి ఉంటాడని అనుకున్నారు. అయితే మంగళవారం చెరువులో శవం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి శవాన్ని వెలికితీయించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.