
సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులైన దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ధర్మవరంలో కలకలం రేపింది. కరోనా కారణంగా ఫణిరాజ్ (42), శిరీష (40)ల మధ్య విబేధాలు తలెత్తడంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారం క్రితం ఫణిరాజ్ తల్లి కరోనా బారినపడి మృతి చెందగా, అదే కుటుంబంలో కొడుకు,కోడలు బలవన్మరణానికి పాల్పడటంతో ధర్మవరంలో విషాదం అలుముకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.