తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. తోటి మహిళా శాసనసభ్యురాలిని అవహేళన మాట్లాడితే అసెంబ్లీలో ఉండడానికి మనం అర్హులమా, కాదా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలని జగన్ అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను స్పీకర్ కనీసం క్షమాపణ కూడా అడగకపోతే ఈ సభలో తమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. గోరంట్లతో క్షమాపణ చెప్పించాలని తాము డిమాండ్ చేస్తే... సభ ముగిసిన తర్వాత ఏం మాట్లాడుకున్నారో చూస్తామనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రోడ్డు పొడుగునా ఏం జరుగుతుందో అది కూడా చూసుకుంటూ పోదామా అని ప్రశ్నించారు. ఆడకూతురితో సభలో కన్నీళ్లు పెట్టించిన గోరంట్ల క్షమాపణ చెప్పిన తర్వాతే ఇతర విషయాలు చర్చిద్దామన్నారు. అయితే సీఆర్డీఏ బిల్లుకు తాము అడ్డుపడుతున్నామని ప్రభుత్వం బురద చల్లుతుందన్న కారణంతో సీఆర్డీఏ బిల్లుపై చర్చకు .జగన్ అంగీకరించారు. దీంతో గోరంట్ల వ్యాఖ్యలపై దుమారానికి తెరపడింది.
Published Mon, Dec 22 2014 5:05 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement