అందరూ కలిసి పనిచేయాల్సిందే..
పార్టీలో కొత్త నేతలు, పాత నేతలు అన్న తేడా ఉండదు. పార్టీలోకి వచ్చిన తరువాత అందరూ ఒక్కటే. పాత వాళ్లతో కొత్త నేతలు, కొత్త వాళ్లతో పాత నేతలు కలగలిసి పోవాల్సిందేనంటూ పార్టీ జిల్లా పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
టీడీపీ సమన్వయకర్తల సమావేశంలో జిల్లా పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి
ఒంగోలు సబర్బన్:
పార్టీలో కొత్త నేతలు, పాత నేతలు అన్న తేడా ఉండదు. పార్టీలోకి వచ్చిన తరువాత అందరూ ఒక్కటే. పాత వాళ్లతో కొత్త నేతలు, కొత్త వాళ్లతో పాత నేతలు కలగలిసి పోవాల్సిందేనంటూ పార్టీ జిల్లా పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. టీడీపీ సమన్వయకర్తల సమావేశం అనంతరం జిల్లా పార్టీ పరిశీలకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. పార్టీలో పాత, కొత్త అన్న తేడా ఏమీ ఉండదని అందరినీ కలుపుకు పోవటమే పార్టీ నాయకుల నైజంగా ఉండాలన్నారు. అందరం కలిసి పనిచేసుకు పోదాం, సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలి. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఐదు రోజుల్లో సాగరు జలాలు జిల్లాకు చేరుకోనున్నాయని చెప్పారు.
ప్రతినెలా రెండో వారంలో సమావేశాలు..
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లాలో పార్టీ కంచుకోటలా మారనుందని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మరో మంత్రి శిద్దా మాట్లాడుతూ వచ్చేనెల రెండో వారంలో నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ప్రతి నెలా రెండోవారంలో ఇదే విధంగా నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. పట్టిసీమ ద్వారా తూర్పు ప్రకాశంలోని పర్చూరు నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వివరించారు. జిల్లాలో రైతులకు 790 రెయిన్ గన్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చూస్తామన్నారు. సమావేశానికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావులు గైర్హాజరయ్యారు. సమావేశానికి ఎమ్మెలు, నియోజకవర్గ ఇన్‌చార్‌్జలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.