ఓటు కుట్రలకు చెక్‌ పెట్టండి | Gorantla Madhav Meet Anantapur Collector | Sakshi
Sakshi News home page

ఓటు కుట్రలకు చెక్‌ పెట్టండి

Published Thu, Feb 28 2019 9:32 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

Gorantla Madhav Meet Anantapur Collector - Sakshi

ఆధారాలను కలెక్టర్‌కు అందజేసి పరిస్థితి వివరిస్తున్న గోరంట్ల మాధవ్, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

అనంతపురం అర్బన్‌: రాప్తాడు నియోజకవర్గం పరిధిలో ఓట్ల తొలగింపునకు భారీగా కుట్రకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ ఓటర్లు, సానుభూతిపరుల లక్ష్యంగా అధికారపార్టీ ఈ చర్యలకు పాల్పుడతోందని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త గోరంట్ల మాధవ్, రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కలెక్టర్‌ వీరపాండియన్‌కు  విన్నవించారు.

బుధవారం వారు కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేయడంతోపాటు ఆధారాలను సమర్పించారు. నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్‌సీపీకి చెందిన దాదాపు 14 వేల ఓట్లను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓటర్లకు తెలియకుండా ఫారం–7లో దరఖాస్తు చేశారన్నారు. ఆ తర్వాత బీఎల్‌ఓపై ఒత్తిడి తీసుకొచ్చి వాటని ఆమోదింపజేసేలా కుట్రకు తెరతీశారన్నారు.

ఓటు తొలగింపునకు సంబంధించి నోటీసు అందడంతో జరుగుతున్న కుట్ర వెలుగు చూసిందన్నారు. ప్రస్తుతం ఓట్ల తొలగింపునకు వచ్చి దరఖాస్తులన్నీ బోగస్‌వేనని చెప్పారు. ఈ చర్యకు ఎవరు పాల్పడ్డారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఫారం–7 దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇంటింటికి వెళ్లి విచారణ చేయించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, నాయకుడు హరినాథ్‌రెడ్డి, న్యాయవాది నరేంద్రరెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement