
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ పార్టీ! ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ కొంప ముంచిందా..? నేల విడిచి సాము చేశామా..? అనే విషయాలను విశ్లేషించుకోవాలని తెలిపారు. తాను గతంలోనే పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశానన్నారు. కానీ అప్పుడు తన మాటలు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కులాల ప్రస్తావన వచ్చిందని, ఇదేమన్నా దెబ్బ తీసిందా..? అనే అంశంపైనా విశ్లేషిస్తామన్నారు. పార్టీ బాగు కోసం సూచనలు చేస్తామన్నారు. చంద్రబాబునాయుడే టీడీఎల్పీ నేతగా ఉండాలని కోరారు. చంద్రబాబు ముందుంటేనే తమకు ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబును ఇంటికొచ్చి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై ఆలోచిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment