
'రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయండి'
చిత్తూరు జిల్లా నగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను కనీసం ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ సభ బాగుంటుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను కనీసం ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ సభ బాగుంటుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్పీకర్ను ఫ్యాక్షనిస్ట్ అంటున్న ఆమెపై సస్పెన్షన్ వేటు వేయాలన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల... పనికిరాని నాయకురాలు ... సభా గౌరవానికి భంగం కలుగుతోంది. మహిళలను గౌరవించే సంస్కృతి ఉంది. అయితే రోజా వాడే పదజాలం, వ్యవహరించే తీరు బాధాకరం' అన్నారు.
పనిలో పనిగా గోర్లంట బుచ్చయ్య చౌదరి ...ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతను విస్మరిస్తున్నారని, సభలో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. విపక్ష సభ్యులు స్పీకర్పై దండయాత్ర చేయటం క్షమించరాని నేరమన్నారు. స్పీకర్కు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.