గోరంట్ల కాన్వాయ్‌ ఎదుట తమ్ముళ్ళ వీరంగం | TDP Supporters hulchul in east godavari district | Sakshi
Sakshi News home page

గోరంట్ల కాన్వాయ్‌ ఎదుట తమ్ముళ్ళ వీరంగం

Published Tue, Jun 7 2016 9:19 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

గోరంట్ల కాన్వాయ్‌ ఎదుట తమ్ముళ్ళ వీరంగం - Sakshi

గోరంట్ల కాన్వాయ్‌ ఎదుట తమ్ముళ్ళ వీరంగం

ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకం ధ్వంసం
 
తొర్రేడు (రాజమహేంద్రవరం రూరల్) : పార్టీలో సముచితస్థానం కల్పించడంతోపాటు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో తెలుగు తమ్ముళ్ళు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఆయన శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన సంఘటనతో తొర్రేడు గ్రామంలో సోమవారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. తొర్రేడు గ్రామం ఎస్సీపేటలో సోమవారం రాత్రి మంచినీటి పథకానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు.
 
ఈ విషయాన్ని కనీసం పార్టీ నాయకులకు తెలియజేయకుండా శంకుస్థాపన చేయడం ఏమిటని టి.డి.పి.నాయకుడు మెప్పిలి అయ్యన్న, ఇతర నాయకులు సొసైటీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పార్టీలో పనిచేసేవారికి గుర్తింపు ఇవ్వరా అంటూ నిలదీశారు. సుమారు పది నిమిషాలపాటు తెలుగు తమ్ముళ్ళు వీరంగం చేశారు. ఎమ్మెల్యే గోరంట్లను అక్కడ నుంచి సొసైటీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమానికి మరో వర్గం నేతలు, కార్యకర్తలు తీసుకుని వెళ్ళిపోయారు. అనంతరం ఎస్సీపేటలో శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసంచేశారు.దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement