హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన లక్ష ఎకరాల భూసేకరణ కార్యక్రమం దోపిడీలో ఒక భాగమేనని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో సీఆర్డీఏ బిల్లు చర్చ సందర్భంగా మాట్లాడిన ఆళ్లగడ్డ.. రాజధాని కమిటీలో పచ్చచొక్కాలే కనబడుతున్నాయని మండిపడ్డారు. లోప భూయిష్టమైన బిల్లును సరిచేయాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సింగపూర్ కు దోచి పెట్టడానికే చంద్రబాబు పన్నిన కుట్ర అని ఆళ్లగడ్డ అభిప్రాయపడ్డారు.
అసలు శివరామకృష్ణన్ కమిటీని పట్టించుకోకుండా రాజధాని నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. మూడు పంటల పండే ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయవద్దని ఆర్కే తెలిపారు. రైతుల అసంతృప్తి బయటపడుతుందని చంద్రబాబు తిరగలేదన్నారు.