
సాక్షి, అనంతపురం : పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. తమ ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తే సహించేది లేదని పోలీసు అధికారులు మండిపడ్డారు. తలతిక్కగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. పోలీసులను హిజ్రాలతో పోల్చడం సభ్యసమాజానికే సిగ్గుచేటని జేసీ వ్యవహారంపై దుమ్మెత్తిపోశారు. అధికార అహంతో వ్యవహరిస్తే ఖబడ్దార్ అని అన్నారు. జేసీ అసభ్యకర వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలనీ, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని గోరంట్ల మాధవ్, త్రిలోక్‌నాథ్, సూరీ డిమాండ్ చేశారు. కాగా, తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తమ వర్గీయులపై దాడులు చేస్తోంటే పోలీసులు భయపడి పారిపోతున్నారనీ, హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని జేసీ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment