మీడియా ప్రతినిధులకు సంస్కారం లేదు: గోరంట్ల | Gorantla Buchaiah Chowdary takes on journalists | Sakshi
Sakshi News home page

మీడియా ప్రతినిధులకు సంస్కారం లేదు: గోరంట్ల

Published Thu, Oct 29 2015 11:59 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

మీడియా ప్రతినిధులకు సంస్కారం లేదు: గోరంట్ల - Sakshi

మీడియా ప్రతినిధులకు సంస్కారం లేదు: గోరంట్ల

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం గురువారం కాకినాడలో ప్రారంభమైంది. ప్రారంభమైన కొద్దిసేపటికే సమావేశం  రసాభాసగా మారింది. ఈ సమావేశానికి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభంకాగానే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. సంస్కారం లేదంటూ మీడియా ప్రతినిధులపై గోరంట్ల తన ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.

గోరంట్ల వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళనం నెలకొంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అటు గోరంట్ల... ఇటు మీడియా ప్రతినిధులకు సర్థి చెప్పేందుకు యత్నించారు.  గోరంట్ల తీరుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు మీడియా ప్రతినిధులు ప్రకటించారు. ఆ వెంటనే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.  మీడియా ప్రతినిధులకు పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement