గోరంట్ల బుచ్చయ్య విసిరిన సవాల్‌ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్వీకరించారు.
గోరంట్ల సవాల్‌ను స్వీకరించిన ఉండవల్లి
Published Tue, Jan 31 2017 4:14 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
రాజమండ్రి: గోరంట్ల బుచ్చయ్య విసిరిన సవాల్‌ను రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్వీకరించారు. ఈ మేరకు అరుణ్ కుమార్ మంగళవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. స్పెషల్ ప్యాకేజీ ఏమిటో ఇప్పటివరకూ ఎవరికీ అర్ధం కాలేదు. మీకు తెలిసి ఉంటే అదేమిటో నాకు అవగతపర్చగలరని లేఖలో పేర్కొన్నారు. ఇవే కాకుండా , మీరు ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన అన్ని విషయాలపైనా చర్చకు సిద్ధమని లేఖ ద్వారా అంగీకారం తెలిపారు.
దయచేసి సమయం, స్థలం నిర్ధారించి తనకు తెలపాలని ఉండవల్లి కోరారు. ‘పట్టిసీమ’ పధకం ఏవిధంగా నిరుపయోగ పధకమైందో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంక వివరాలతో మీ ముందు ఉంచటానికి సిద్ధంగా ఉన్నానని లేఖ ద్వారా బుచ్చయ్య చౌదరీకి ఉండవల్లి తెలిపారు.
Advertisement
Advertisement