అనంతపురం త్రీటౌన్ సీఐ గోరంట్లమాధవ్‌ను వీఆర్‌కు పంపారు. ఈ మేరకు రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
- మాధవ్‌రెడ్డిపై దాడి వ్యవహారం
- వీఆర్‌కు పంపుతూ ఐజీ ఉత్తర్వులు
అనంతపురం : అనంతపురం త్రీటౌన్ సీఐ గోరంట్లమాధవ్‌ను వీఆర్‌కు పంపారు. ఈ మేరకు రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డి నగదు మార్పిడి కోసం ఈనెల 13న అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న స్టేట్‌బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఈయన ఎస్‌ఐ జనార్దన్‌పై చేయి చేసుకున్నారనే నెపంతో సీఐ గోరంట్ల మాధవ్ రెచ్చిపోయారు.
గొడ్డును బాదినట్లు చావబాదారు. ఈ ఘటనను చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. పోలీసుల తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐ గోరంట్లమాధవ్‌ను బాధ్యుణ్ని చేస్తూ వీఆర్‌కు పంపారు.