మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ (చిత్రంలో కదిరి సమన్వయకర్త డా.సిద్దారెడ్డి)
అనంతపురం, కదిరి : రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న ఓట్ల తొలగింపు కుట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పనే అని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మంగళవారం తన స్వగృహంలో కదిరి సమన్వయకర్త డా.పెడబల్లి వెంకట సిద్ధారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఏనాడూ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించలేదన్నారు. ఎప్పుడూ స్వార్థం కోసమే ఉపయోగించారన్నారు.
ఓట్లు, సీట్లు తప్పా ఆయనకు ఇంకేమీ పట్టవు.. ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపునకు ఐటీశాఖ ఉపయోగపడుతుందనే ఏపీలో లోకేష్‌బాబుకు ఐటీ మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ ద్వారా ఏపీ ప్రజల వ్యక్తిగత వివరాలు, ఏపార్టీకి సానుభూతి పరులు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవన్నీ బహిర్గతం కావడంతో తండ్రీ కొడుకులపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
ఉలుకెందుకు బాబూ?: ఏపీ ప్రజల వివరాలు బహిర్గతమైన విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తుంటే చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో అర్థం కావడం లేదని మాధవ్ అన్నారు. కచ్చితంగా ఇది చంద్రబాబు పన్నిన కుట్రేనన్నారు. ఐటీ గ్రిడ్ సీఈఓకు, లోకేష్‌బాబుకు సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందన్నారు. చంద్రబాబు కుట్రలు మరోసారి బహిర్గతమయ్యాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 30 సీట్లు కూడా రావనే విషయం చంద్రబాబు గ్రహించే ఇలా ఓట్లను తొలగించే దుర్మార్గపు పనులకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. రెండు రోజులుగా చంద్రబాబు హడావుడి చూస్తుంటే ఐడీ గ్రిడ్‌కు, ప్రభుత్వానికి సంబంధం ఉందనే విషయం చెప్పకనే అర్థమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment