రాజమహేంద్రవరం రూరల్: సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించిందని.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు కందుల దుర్గేష్ ఎవరని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయనతో తనకు వ్యక్తిగతంగా విభేదాలేవీ లేవని, జనసేన తమకు కేవలం మిత్రపక్షమేనని, టీడీపీ బలమైన పార్టీ అని అన్నారు. టీడీపీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా అసెంబ్లీకి తాను పోటీ చేయటం ఖాయమని, ఎంపీగా మాత్రం పోటీ చేయనని చెప్పారు. అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధమని గోరంట్ల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment