సొంత పార్టీ మహిళపై టీడీపీ నేతల దాడి | - | Sakshi
Sakshi News home page

సొంత పార్టీ మహిళపై టీడీపీ నేతల దాడి

Published Tue, Apr 16 2024 11:40 PM | Last Updated on Wed, Apr 17 2024 11:10 AM

- - Sakshi

రామచంద్రపురం: టీడీపీలోని సొంత పార్టీకే చెందిన ఒక ఆర్యవైశ్య మహిళపై అదే పార్టీకి చెందిన కొంతమంది దాడికి దిగిన ఘటన రామచంద్రపురం పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. దాడికి గురైన టీడీపీ మహిళా కోఆర్డినేటర్‌, బూత్‌ ఇన్‌చార్జి ఖండవిల్లి దుర్గాదేవి విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మంగళవారం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ భార్య సునీత.. స్థానిక నాయకులు, మహిళలతో కలిసి 12వార్డులో ఇంటింటి ప్రచారం చేశారని, బూత్‌ ఇన్‌చార్జి అయిన తనకు, యూనిట్‌ ఇన్‌చార్జి అయిన తన భర్తకు సమాచారం ఇవ్వకుండా, మా వార్డులో ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం అని అడిగానని దుర్గాదేవి వివరించారు.

నా భర్త పక్కన వున్న వారితో మాట్లాడుతుండగానే అక్కడే వున్న టీడీపీకి చెందిన గడి జగన్‌ అసభ్యకరంగా మాట్లాడుతూ అక్కడే వున్నా గడి గోవిందు, గోల్డ్‌ షాప్‌ మురళిలతో కలసి దాడి చేశారని తెలిపారు. తన రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా గడి జగన్‌ చెప్పుతో కొట్టి నడిరోడ్డులో అందరిముందు అవమానించినట్టు తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రచారంలో ఉన్న టీడీపీ అభ్యర్థి సుభాష్‌ భార్య సునీత కానీ, అక్కడ వున్న మహిళా నాయకులు కానీ పట్టించుకోకపోవటం విచారకరమని దుర్గాదేవి అన్నారు. తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై సీఐ పి.దొరరాజును వివరణ కోరగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement