అనంతపురం : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మల్లెల గ్రామంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం విద్యార్థులతో వొనవోలు నుంచి గోరంట్ట వెళ్తున్న జ్ఞానేశ్వర్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు, బస్సు డ్రైవర్ కు గాయాలయ్యాయి.
మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్తానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.