stidents injured
-
స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు
అనంతపురం : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మల్లెల గ్రామంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం విద్యార్థులతో వొనవోలు నుంచి గోరంట్ట వెళ్తున్న జ్ఞానేశ్వర్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు, బస్సు డ్రైవర్ కు గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్తానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు గాయాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వెలగలపొన్నూరు వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న వికాస్ స్కూస్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, తీవ్రంగా 16మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.