కరెన్సీ కలకలం | Fake currency Business in Gorantla | Sakshi
Sakshi News home page

కరెన్సీ కలకలం

Published Wed, Feb 10 2016 2:27 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

కరెన్సీ కలకలం - Sakshi

కరెన్సీ కలకలం

* రూ.40కు రూ.100 నోటు
* యథేచ్ఛగా నకిలీ నోట్ల చెలామణి!

 గోరంట్ల(పెనుకొండ) : గోరంట్ల కేంద్రంగా నకిలీ నోట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ఇక్కడకు నకిలీ నోట్లు పెద్ద ఎత్తున వస్తున్నట్లు సమాచారం. గోరంట్లలోని ఆరు క్రియాశీలక కేంద్రాలకు తొలుత నకిలీ కరెన్సీ చేరుతోంది. అక్కడి నుంచి ఈ అక్రమ వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 40 అసలు నోటు ఇస్తే రూ. 100 నకిలీ నోటు ఇస్తున్నారు.

దీంతో చాలా మంది గ్రామీణులు, యువత ఈ అక్రమ వ్యాపారం వైపు ఆకర్షితులవుతున్నారు. ఏకంగా దుబాయ్ నుంచే ఇక్కడకు నకిలీ కరెన్సీ దిగుమతి అవుతోందన్న ఆరోపణలున్నాయి. ఫైనాన్స్, చీటి నిర్వాహకుల ద్వారా నకిలీ నోట్లు మార్కెట్‌లోకి చెలామణి అవుతోందన్న విమర్శలున్నాయి. వీటిలో రూ. 500, రూ.1000 నోట్లే అధికంగా ఉండడం గమనార్హం. దీనిపై స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... నకిలీ నోట్ల చెలామణిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement