నల్లగొండ క్రైం: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కొండారం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండారం గ్రామానికి చెందిన చెనగోని దశరథ (44) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దశరథ గురు వారం సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజు వేసేందుకు ఫోన్‌లో సబ్‌స్టేషన్ ఆపరేటర్ వద్ద ఎల్‌సీ తీసుకున్నాడు.
అనంతరం ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఫ్యూజు వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావ డంతో విద్యుదాఘాతానికి గుర య్యాడు. ట్రాన్స్‌ఫార్మర్‌పైనే దశ రథ మృతిచెందాడు. సమీపంలోని రైతులు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ అధి కారులు వచ్చే వరకు మృతదేహాన్ని కిందకి దించమని కుటుంబ సభ్యు లు భీష్మించారు. అయితే రాత్రి వరకు ఘటనాస్థలానికి అధికారు లు ఎవరూ చేరుకోలేదు. మృతుడికి భార్య నాగలక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment