చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని వడియారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జియాఉల్‌రెహమాన్ స్థానిక మసీద్‌లో గురువుగా ఉన్నారు. అతని కుమారుడు జమీల్ (10) శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై సరదాగా తిరుగుతూ గ్రామ పంచాయతీ మినీ వాటర్ ట్యాంకు వద్ద ఆగాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వద్ద ఎర్తింగ్ రావడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అకస్మాత్తుగా పడిపోయిన జమీల్‌ను చూసి స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని, మృతుడి కుటుంబీకులకు పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment