current shok
-
సెల్‌ఫోన్ చార్జర్ తీస్తుండగా.. దారుణం
సాక్షి,నెల్లూరు: సెల్‌ఫోన్ చార్జర్‌ను ప్లగ్ పాయింట్ నుంచి తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సైదాదుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సురేష్(33) తన నివాసంలో సెలఫోన్‌కు చార్జ్ పెట్టి తీస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు విచారణలో తెలిందని పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అందించారు. మృతుడు ఇటీవల కువైట్ నుంచివచ్చాడని, మృతునికి భార్య ,ఒక బిడ్డ ఉన్నారని పోలీసులు తెలిపారు. -
విషాదం : విద్యుత్‌షాక్‌తో దంపతుల మృతి
సాక్షి, వరంగల్ : బతుకుదెరువు కోసం వచ్చిన దంపతులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మసాగర్ మండలం కాశగూడెంకు చెందిన సయ్యద్ హైదర్ (40), గోరిభి (38) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తుండడంతో గోరిభి బయట తీగలపై ఉన్న బట్టలు తీయడానికి వెళ్లింది. అప్పటికే వర్షం కురువడంతో తీగలకు విద్యుత్ సరఫరా అయింది. ఆ విషయం తెలియని గోరిభి తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. బయట శబ్దం రావడంతో భర్త సయ్యద్ బయటికి వచ్చి తన భార్యకు ఏమైందోనని ఆమెను పట్టుకునేసరికి అతనూ కూడా షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో ఒకేసారి దంపతులిద్దరు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
భార్యపై కోపంతో కరెంటు తీగలు పట్టుకున్నాడు!
సాక్షి, పెద్దమండ్యం(చిత్తూరు) : భార్యతో గొడవ పడిన ఓ ప్రబుద్ధుడు కోపంతో కరెంటు తీగలను పట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. మండలంలో ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. సి.గోళ్లపల్లె పంచాయతీ కనుమలోపల్లె దళితవాడకు చెందిన పెద్దమల్లయ్య (44) ఇంటి విషయమై భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగని పెద్దమల్లయ్య భార్యపై కోపంతో పల్లె వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కున్న ఫ్యూజు క్యారీయర్లకు ఉన్న సరఫరా వైర్లను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుని చేతులు కాలిపోయాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. -
అయ్యో పాపం విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి
చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని వడియారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జియాఉల్‌రెహమాన్ స్థానిక మసీద్‌లో గురువుగా ఉన్నారు. అతని కుమారుడు జమీల్ (10) శుక్రవారం సాయంత్రం సైకిల్‌పై సరదాగా తిరుగుతూ గ్రామ పంచాయతీ మినీ వాటర్ ట్యాంకు వద్ద ఆగాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం వద్ద ఎర్తింగ్ రావడంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా పడిపోయిన జమీల్‌ను చూసి స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని, మృతుడి కుటుంబీకులకు పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతుకు తీవ్ర గాయాలు
మెదక్ రూరల్: బోరు మోటార్ విద్యుత్తు సర్వీస్ వైరు తెగిపడి ఓ రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ మండలం శమ్నాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలివీ...గ్రామానికి చెందిన మైలి పోచయ్యకు గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉంది. కాగా, ఆ పొలానికి కరెంటు స్తంభాలు దూరంగా ఉండటంతో ఆమేర సర్వీస్ వైర్‌ను కర్రల మీదుగా లాగి మోటారును నడిపించుకుంటున్నాడు. కాగా, మంగళవారం ఉదయం కర్రపై ఉన్న తీగ కిందను సరి చేసేందుకు పోచయ్య ప్రయత్నించగా షాక్ తగిలింది. గాయపడిన పోచయ్యను తోటి రైతులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ముగ్గురికి గాయాలు
చాంద్రాయణగుట్ట : నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ముగ్గురు కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. సోమవారం ఉదయం మరమ్మతు పనుల్లో భాగంగా సురేష్ అనే కార్మికుడు ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే, ముందుగా లైన్ క్లియరెన్స్ తీసుకోకుండా స్తంభం ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకోవడంతో షాక్‌కు గురై తీగలకు వేలాడుతుండగా... అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులు అతడ్ని పట్టుకుని కిందకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో సురేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానికంగా ఓ ప్రై వేటు ఆస్పత్రికి తరలించారు. -
కరెంట్‌షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మండలంలోని చాలకూరుకు చెందిన చిరంజీవి(30), చేతగానిపల్లెకు చెందిన శ్రీనివాసులు(25) మరికొందరితో కలసి డీఆర్‌కాలనీలో ఓ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. శనివారం ఉదయం వారు పనిచేస్తున్న చోట సపోర్ట్ కోసం ఉంచిన ఇనుప పైపులపై విద్యుత్ తీగలు పడ్డాయి. దీంతో వాటిపై పనిచేస్తున్న శ్రీనివాసులు, చిరంజీవి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు నిరసనగా మృతుల కుటుంబాల వారు మేస్త్రీలపై భవన యజమానులపై దాడికి పాల్పడ్డారు. (హిందూపురం) -
కరెంట్ షాక్‌తో ఇద్దరు కార్మికులు మృతి
హైదరాబాద్: నాలా శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మియాపూర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఓ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కరెంట్ తీగలు తెగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. (మియాపూర్) -
స్కూల్లో విద్యుత్ షాక్... విద్యార్థిని మృతి
ఎలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం విలపకుర్రు హైస్కూల్లో విద్యుత్ షాక్‌కు గురై ఆరో తరగతి విద్యార్థిని మృతి చెందింది. చింతదిబ్బ గ్రామానికి చెందిన విద్యార్థిని మౌనిక సోమవారం ఉదయం స్కూల్ ఆవరణలోని నీటి ట్యాంక్ వద్దకు వెళ్లగా ఎర్త్‌వైర్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. స్థానికులు హుటాహుటిన ఆమెను పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.