ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,నెల్లూరు: సెల్‌ఫోన్ చార్జర్‌ను ప్లగ్ పాయింట్ నుంచి తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సైదాదుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సురేష్(33) తన నివాసంలో సెలఫోన్‌కు చార్జ్ పెట్టి తీస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు విచారణలో తెలిందని పోలీసులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అందించారు. మృతుడు ఇటీవల కువైట్ నుంచివచ్చాడని, మృతునికి భార్య ,ఒక బిడ్డ ఉన్నారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment